: సల్మాన్ గురించి కొత్తగా ఏం చెప్తాం?: అర్బాజ్ ఖాన్


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తున్నారని వచ్చిన వార్తలన్నీ రూమర్లని సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ స్పష్టం చేశాడు. సల్మాన్ చరిత్రను వెండితెరకు పరిచయం చేయాలని తాను భావించలేదని అర్బాజ్ చెప్పాడు. అయినా సల్మాన్ జీవితం గురించి కొత్తగా చెప్పడానికి ఏముందని ప్రశ్నించాడు. సల్మాన్ అడిగితే మాత్రం తప్పక తీస్తానని అర్బాజ్ చెప్పాడు. సల్మాన్ జీవిత చరిత్ర కాదు కానీ, నీరజ్ పాండే తెరకెక్కిస్తున్న ధోనీ జీవిత చరిత్రపై అంతా ఆసక్తిగా ఉన్నట్టు అర్బాజ్ తెలిపాడు. ధోనీ గురించి ఏం తీస్తున్నారనేది చూడాలని భావిస్తున్నామని అర్బాజ్ ఖాన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News