: తెలంగాణ ఉద్యోగులకు వచ్చే నెల నుంచి పీఆర్సీతో కూడిన జీతం
తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే నెల నుంచి ఉద్యోగులు పీఆర్సీతో కూడిన జీతాన్ని అందుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగుల పీఆర్సీ వర్తింపు విధివిధానాలను ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది. దాంతో పీఆర్సీ ద్వారా పెరిగే జీతభత్యాలను వచ్చే నెల ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితేే మార్చి నెలకు సంబంధించిన బకాయిలను మాత్రం ఈ నెలలోనే చెల్లిస్తున్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది. అయితే తొమ్మిది నెలల బకాయిలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించలేదు.