: ఫ్యాబ్ ఇండియా తప్పు చేసి ఉండదు: గోవా సీఎం క్లీన్ చిట్


ఫ్యాబ్ ఇండియాను వెనుకేసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం విశేషం. గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణం ట్రైల్ రూంలో ఆ సంస్థ కెమేరా అమర్చి ఉండదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అభిప్రాయపడ్డారు. ఫ్యాబ్ ఇండియా పెద్ద వస్త్ర సంస్థ అని, దాని లోపం ఉందని తాను భావించడం లేదని ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ట్రైల్ రూంలో కెమెరాను గుర్తించి, వెలికి తీయించిన సంగతి తెలిసిందే. అందులో ఓ సెలబ్రిటీ పుటేజ్ కూడా బయటపడిన సంగతి కూడా తెలిసిందే. భద్రత కోసం ఏర్పాటు చేసిన కెమేరాలో, ట్రైల్ రూం దృశ్యాలు పొరపాటున రికార్డయ్యాయట. ఫ్యాబ్ ఇండియా నిందితులు బెయిల్ కోసం కోర్టులో కూడా ఇదే వాదన వినిపించారు. ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి కూడా వారి వాదనకు మద్దతుగా నిలవడం విచిత్రం. పొరపాటుగా రికార్డు చేస్తే, అది తప్పు కాదు అనేలా సీఎం వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News