: పిల్లలు కావాలి కానీ, ఇంకా జీవితాన్ని ఆస్వాదించాలి: సన్నీలియోన్
బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ రెండు సినిమాలతో యువత గుండెల్లో గుబులు రేపేందుకు సిద్ధమవుతోంది. ఏక్ పహేలీ లీలా, కుచ్ కుచ్ లోచాహై సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొంటూ సన్నీ బిజీగా గడుపుతోంది. తనకు పిల్లలు కనాలని ఉందని, కానీ ఇప్పుడే కాదని, జీవితాన్ని భర్తతో కలసి ఆస్వాదిస్తున్నానని సన్నీ తెలిపింది. ప్రెగ్నెంట్ కావాలంటే మానసికంగా, శారీరకంగా సన్నద్ధం కావాలని సన్నీలియోన్ చెబుతోంది. ప్రస్తుతం తన భర్త డానియెల్ వెబర్ బాలీవుడ్ లో నటించేందుకు సన్నద్ధమవుతున్నాడని, శ్రద్ధగా హిందీ నేర్చుకుంటున్నాడని సన్నీ చెబుతోంది.