: చీపురు పట్టిన షారూక్ రెండేళ్ల కొడుకు... ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్న చిత్రం


బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తన రెండేళ్ల కొడుకు అబ్రామ్ చీపురు పట్టుకున్న చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియాపై నమ్మకం కుదిరిందో లేక 'క్విడిట్చ్' (మంత్రగాళ్ళు చీపుర్లపై ఎగురుతూ ఆడే ఆట) ఆడాలని అనుకున్నాడో' అని ట్వీట్ చేస్తూ, అబ్రామ్ ఫోటో పెట్టాడు. హ్యారీ పోటర్ సిరీస్ చిత్రాలు చూసిన వారికి 'క్విడిట్చ్' గురించి కాస్తో కూస్తో పరిచయం ఉండే ఉంటుంది. ఇక ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కు మద్దతు పలికిన తొలి స్టార్ కిడ్ అబ్రామ్ అంటున్నారు నెట్ ప్రేమికులు. షారూక్ పోస్ట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

  • Loading...

More Telugu News