: జాకీచాన్ రేంజ్ ఫైట్లతో ముందుకొస్తున్న హాస్యనటుడు
జాకీచాన్ రేంజ్ ఫైట్లతో అభిమానులను అలరించేందుకు వడివేలు సిద్ధమవుతున్నారు. 'హింసించే 23వ రాజు పులకేశి' సినిమాలో హీరోగా కనిపించి కడుపుబ్బనవ్వించిన తమిళ కమేడియన్ వడివేలు, పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. రాజకీయ రంగప్రవేశం చేసి, సినీ పరిశ్రమకు కంటగింపుగా మారి, అడపాదడపా నవ్విస్తున్నాడు. 'ఎలి' అనే సినిమాతో హీరోగా రెండోసారి వడివేలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో జాకీచాన్ రేంజ్ ఫైట్స్ ఉన్నట్టు సమాచారం. హస్యనటుడైన తాను ఇలా ఫైట్స్ చేస్తే ప్రేక్షకులు ఆదరించరని చెప్పినా, దర్శకుడు పట్టుబట్టడంతో ఫైట్స్ చేస్తున్నాడట.