: ధోనీ దూకమంటే 24 అంతస్తుల పైనుంచీ కూడా దూకేస్తానంటున్న క్రికెటర్
క్రికెట్ కెరీర్ లో ఎగుడుదిగుడులను ఎదుర్కొంటూ, ఇటీవలి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు ఆడలేకపోయిన పేసర్ ఇషాంత్ శర్మ, ధోనీ తనకు ఎంతో మద్దతుగా నిలిచాడని అంటున్నాడు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్న వేళ ధోనీ చూపిన ఓదార్పు మరువలేనిదని అన్నాడు. ధోనీ దూకమంటే, మరేం ఆలోచించకుండా 24 అంతస్తుల భవనం పైనుంచీ కూడా దూకేస్తానని తెలిపాడు. మహీ భాయ్ వంటి కెప్టెన్ నేతృత్వంలో పని చేయాలని అందరికీ ఉంటుందని తెలిపాడు. మోకాలి గాయం కారణంగానే ఎంతో ముఖ్యమైన వరల్డ్ కప్ పోటీలు ఆడలేక పోయినట్టు వివరించాడు. తాను నిరుత్సాహంలో ఉన్నప్పుడు ధోనీ ఎంతో సహాయపడ్డాడని తెలిపాడు.