: మస్తాన్ బాబు మృతదేహం తరలింపుపై కుటుంబ సభ్యుల ఆందోళన
చిలీలోని ఆండీస్ పర్వతాల్లో చనిపోయిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం తరలింపుపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం ఇంకా ఘటనాస్థలంలోనే ఉందని, ఆచూకీ తెలిసి 3 రోజులైనా ఎలాంటి తరలింపు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ హెలికాప్టర్ తో మృతదేహాన్ని తరలించడం అసాధ్యమని, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు మాత్రమే తీసుకురాగలవని అంటున్నారు. మరోవైపు పర్వతాల వద్ద పరిస్థితి అనుకూలించకపోవడం వల్లనే మస్తాన్ బాబు మృతదేహం తరలింపు ఆలస్యమయ్యేలా ఉందని కేంద్ర విదేశాంగ అధికారులు చెబుతున్నారు.