: లోహియా విగ్రహానికి మాంఝీ దండవేశారని శుద్ధి చేసిన ఆర్జేడీ కార్యకర్తలు!
బీహార్ లో కుల వివక్ష కొనసాగుతూనే వుంది. తాజాగా సుపౌల్ లోని స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ మనోహర్ లోహియా విగ్రహానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మహా-దళిత్ కమ్యూనిటీ ప్రముఖనేత అయిన జితన్ రాం మాంఝీ పూలదండలు వేశారు. ఇది తెలిసిన ఆర్జేడీ కార్యకర్తలు వెంటనే ఆ విగ్రహానికున్న పూలమాలలు తీసిపారేశారు. అనంతరం విగ్రహాన్ని శుద్ధి చేశారు. ఈ ఘటనపై జేడీ(యూ) అభ్యంతరం వ్యక్తం చేసింది. "ఈ చర్యను మేము ఖండిస్తున్నాం. రామ్ మనోహర్ లోహియా ప్రజల నేత. ఆయన విగ్రహానికి పూలమాల వేసే అర్హత ప్రతి ఒక్కరికీ ఉంది" అని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై మాంఝీ స్పందిస్తూ, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలన్నారు.