: విడుదల చేయండి... లేదంటే మరణాన్ని ప్రసాదించండి: రాష్ట్రపతికి 130 మంది ఖైదీల లేఖ


గడచిన 20 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న తమను విడుదల చేయాలని, లేకుంటే మెర్సీ కిల్లింగ్ విధానంలో మరణాన్ని ప్రసాదించాలని 130 మంది ఖైదీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలు ఖైదీలు ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. తమ కుటుంబాలు దారిద్ర్యంతో అల్లాడుతున్నాయని, పిల్లలకు చదువు లేకుండా పోయిందని, వారి దుర్భర పరిస్థితి తమను ఆందోళనకు, తీవ్ర మనస్తాపానికి గురి చేస్తోందని వారు తెలిపారు. తమ శిక్షా కాలం పూర్తయినా విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఈ లేఖను రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి, జార్ఖండ్ గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులకు కూడా రాశారు.

  • Loading...

More Telugu News