: డైనమిక్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి సాధ్యం: నిర్మలా సీతారామన్


ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎప్పటికప్పుడు పూర్తిగా సహకరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ప్రధానంగా డైనమిక్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. గుంటూరు జిల్లాలోని వంకాయలపాడులో నెలకొల్పిన సుగంధ ద్రవ్యాల పార్కు ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 109 ఎకరాల సుగంధ ద్రవ్యాల పంట విస్తరించి ఉందని చెప్పారు. వంకాయలపాడులో 124 ఎకరాల విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల పార్కు అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రమోటర్లుగా ఉన్నవారు రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మిరప ప్యాకింగ్, భద్రతకోసం 18 గోదాములు ఇక్కడే ప్రారంభమవుతాయని ఆమె వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రాయితీలను ఈ పార్కుకు ఇస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News