: ఎర్ర రంగు కారు కోసం పోలీసులు ముమ్మర వేట... కనబడితే చెప్పాలంటూ ప్రజలకు విజ్ఞప్తి


కృష్ణా జిల్లా హనుమంతపాలెం వద్ద నేటి ఉదయం చోటుచేసుకున్న దారి దోపిడీ నాలుగు జిల్లాల పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. లిఫ్ట్ అడిగి కారు ఎక్కిన దుండగుడు కొద్దిదూరం వెళ్లగానే తుపాకీతో కారు యజమానిని బెదిరించి అతడి వద్దనున్న బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. అనంతరం కారు యజమానిని దించేసి కారుతో ఉడాయించాడు. దీంతో కారు యజమాని సమీపంలోని నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నేరం జరిగిన తీరు తెలుసుకున్న పోలీసులు సదరు దుండగుడు ‘సూర్యాపేట షూటర్స్’ సహచరుడని అనుమానిస్తున్నారు. అనుమానం వచ్చిందే తడవుగా కృష్ణా జిల్లాలోని పోలీసులతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఎర్ర రంగులో ఏపీ 31 క్యూ 3438 నెంబరుతో వెళుతున్న కారు కనిపిస్తే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కారు కోసం నాలుగు జిల్లాల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News