: ఆస్ట్రేలియా సైన్యంలో చేరిన బ్రిటన్ యువరాజు హ్యారీ


సుమారు పది సంవత్సరాల మిలిటరీ కెరీర్ లో చివరి మిషన్ లో పాల్గొనేందుకు బ్రిటన్ యువరాజు హ్యారీ ఈ ఉదయం ఆస్ట్రేలియాకు వచ్చారు. ఆయన నాలుగు వారాలపాటు ఆస్ట్రేలియా సైన్యంలో విధులు నిర్వహిస్తూ శిక్షణ పొందనున్నారు. లండన్ నుంచి సిడ్నీకి వచ్చిన క్వాంటాస్ విమానంలో ఆయన సైనిక దుస్తులు ధరించి వచ్చినట్టు తెలిసింది. ఆస్ట్రేలియా డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ గా ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ మార్క్ బిన్స్ కిన్ కు ప్రిన్స్ హ్యారీ రిపోర్ట్ చేస్తారని, ఈ నాలుగు వారాల కాలంలో ఒక్కసారి మాత్రమే బయట కనిపిస్తారని సమాచారం. ఏప్రిల్ 25న జరిగే మొదటి ప్రపంచ యుద్ధ అమరవీరుల సంస్మరణ ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News