: మేం తలచుకుంటే టీడీపీ సర్కారు కూలుతుంది: బీజేపీ నేత సంచలన ప్రకటన
బీజేపీకి చెందిన ఏపీ కీలక నేత సోము వీర్రాజు కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు. తాము తలచుకుంటే ఏపీలో టీడీపీ సర్కారు కూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీదే అధికారమని కూడా సోము వీర్రాజు అన్నారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఏపీలోని పలు పార్టీలకు చెందిన కీలక నేతలకు కాషాయ తీర్థం ఇప్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వీర్రాజు... గతవారం ఆ పార్టీ నేత, సినీ నటుడు శివాజీపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివాజీ తమ పార్టీ నేత కాదని, ఆయన ప్రకటనలతో తమకేమాత్రం సంబంధం లేదని కూడా వీర్రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.