: అర్వపల్లి గుట్టల్లో సూర్యాపేట షూటర్స్ బ్యాగ్... స్వాధీనం చేసుకున్న పోలీసులు


నల్గొండ జిల్లాలో కలకలం రేపిన సిమీ ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారం పోలీసులకు చిక్కింది. జిల్లాలోని సూర్యపేటలోని హైటెక్ బస్టాండ్ సమీపంలో పోలీసులపై దాడి చేసిన సందర్భంగా ఉగ్రవాదుల భుజానికి కనిపించిన ఓ బ్యాగ్, జానకీపురం సమీపంలో వారి ఎన్ కౌంటర్ సందర్భంగా లభించలేదు. దీంతో కీలక సమాచారం ఆ బ్యాగులోనే ఉంటుందన్న అనుమానంతో పోలీసులు ఎన్ కౌంటర్ జరిగిన నాటి నుంచి నేటి ఉదయం దాకా గుట్టలు, పుట్టలు, పొలాలు, చెట్లు అన్న తేడా లేకుండా ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం ఆ బ్యాగు పోలీసులకు చిక్కింది. ఉగ్రవాదులు తలదాచుకున్నారని భావిస్తున్న అర్వపల్లి దర్గా సమీపంలోని గుట్టల్లోనే ఆ బ్యాగును కనుగొన్న పోలీసులు, దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బ్యాగులో ఏమున్నాయన్న విషయంపై పోలీసులు నోరు విప్పడం లేదు. బ్యాగ్ దొరికిన విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసిన పోలీసులు, ఆ బ్యాగును తమ బాసుల వద్దకు తీసుకెళుతున్నారు. ఈ బ్యాగులోని వస్తువులను పరిశీలిస్తే, ఈ కేసులో కీలక సమాచారం లభ్యమవడమే కాక ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు కూడా వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News