: కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలిప్పించడమే లక్ష్యం:టీడీపీ యువనేత నారా లోకేశ్


తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడమే తమ లక్ష్యమని ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ అన్నారు. హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కొద్దిసేపటి క్రితం ఆయన వృత్తి నైపుణ్య శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త సంతానానికి ఉద్యోగం ఇప్పించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. తొలి దశలో హైదరాబాదుకే దీనిని పరిమితం చేస్తున్నా, సమీప భవిష్యత్తులో జిల్లాలకూ విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News