: ఐపీఎల్ ఛైర్మన్ గా రాజీవ్ శుక్లా?


ఐపీఎల్ ఛైర్మన్ పదవిని మరోసారి అలంకరించాలని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెలలో ఐపీఎల్ ట్రెజరర్ పదవికి పోటీ చేసిన ఆయన శ్రీనివాసన్ మద్దతుదారు అనిరుధ్ చౌధురి చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తాాజాగా ఐపీఎల్ అధ్యక్షుడు కావాలనుకుంటున్నారు. "ఐపీఎల్ తదుపరి ఛైర్మన్ శుక్లానే" అని బీసీసీఐ ఆఫీస్ బేరర్ ఒకరు ఆంగ్ల మీడియాతో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ కొత్త ఛైర్మన్ గా శుక్లానే అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీసీసీఐ మాత్రం ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా పునరాగమనం నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ ఛైర్మన్ గా రంజిబ్ బిశ్వాల్ ఉన్నారు. ఆయననే కొనసాగించాలని శ్రీనివాసన్ వర్గం భావిస్తోంది. ఇక శరద్ పవార్ వర్గం అజయ్ షిర్కేను బలపరుస్తోంది.

  • Loading...

More Telugu News