: మీకు ఉరే సరి... యుద్ధ నేరస్థులకు తేల్చిచెప్పిన బంగ్లా కోర్టు


యుద్ధ నేరాలకు పాల్పడిన దోషులకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించేందుకు బంగ్లాదేశ్ కోర్టు ససేమిరా ఒప్పకోలేదు. తమకు విధించిన ఉరి శిక్షను మరోసారి పరిశీలించాలని యుద్ధ నేరస్థులు పెట్టుకున్న పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. గతంలో ఉరిశిక్షలు విధిస్తూ తాను వెలువరించిన తీర్పులో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చిచెప్పింది. 1971 నాటి బంగ్లా విముక్తి పోరాటంలో మహ్మద్ కుమరుజ్జమాన్, మరో వ్యక్తి దేశ ద్రోహ చర్యలకు పాల్పడ్డారని తేల్చిన ఆ దేశ వార్ క్రైమ్స్ ట్రైబ్యునల్ వారిద్దరికీ ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును పున:పరిశీలించాలని దోషులిద్దరూ పెట్టుకున్న పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు దోషులిద్దరూ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకునే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News