: ఢిల్లీలో అరెస్ట్ అయిన బ్రిటన్ కామాంధుడు


యూకేలో వరుస అత్యాచారాలకు పాల్పడి తప్పించుకు వచ్చిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, భారత జాతీయుడు రమీందర్ సింగ్ (28)ను అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపులు, హత్యాయత్నం తదితర కేసులున్న సింగ్ ను స్కాట్లాండ్ పోలీసుల సమాచారం మేరకు అరెస్ట్ చేసినట్టు వివరించారు. యూకేకు విద్యాభ్యాసం నిమిత్తం వెళ్లిన సింగ్, పలు చిన్న ఉద్యోగాలు చేశాడు. అతను ఉంటున్న హాస్టల్ లోని యువతి తొలి బాధితురాలని, మరో యువతిని పబ్ లో కలసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేయబోగా, ఆమె ప్రతిఘటించడంతో దవడ ఎముకలు విరగ్గొట్టాడని తెలిపారు. కేసులు నమోదు కావడంతో అక్కడినుంచి తప్పించుకు వచ్చి చండీఘడ్, పంజాబ్ రాష్ట్రాల్లో నకిలీ గుర్తింపుతో నివాసం ఉన్నాడని వివరించారు. నిందితుడిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. సింగ్ అరెస్ట్ విషయాన్ని బ్రిటిష్ హై కమిషన్ కు వెల్లడించినట్టు తెలియజేశారు.

  • Loading...

More Telugu News