: సూర్యాపేట షూటర్స్ డెడ్ బాడీల కోసం ఖాండ్వా నుంచి బయలుదేరిన బంధువులు
సూర్యాపేట షూటర్స్ గా పేరుపడి నల్గొండ జిల్లాలో ముగ్గురు పోలీసులను పొట్టనబెట్టుకున్న సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ లో మరో కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదులుగా వివిధ ప్రాంతాల్లో పలు నేరాలకు పాల్పడ్డ వీరి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ రారని తెలంగాణ పోలీసులు భావించారు. అయితే పోలీసుల అంచనాలను తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాకు చెందిన ఎజాజుద్దీన్ బంధువులు అతడి మృతదేహం కోసం నల్గొండ బయలుదేరినట్లు తెలుస్తోంది. అక్కడి ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను వెంటబెట్టుకుని అతడి బంధువులు వస్తున్నట్లు సమాచారం. మరి వారికి మృతదేహం అప్పగింత, కేసు విచారణ తదితరాలపై ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంపై తెలంగాణ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.