: కృష్ణాజిల్లాలో దుండగుడి కలకలం... వ్యాపారి నుంచి బంగారం అపహరణ...సిమి ఉగ్రవాది?


కృష్ణాజిల్లా హనుమంతపాలెం వద్ద గుర్తుతెలియని ఓ దుండగుడు కలకలం సృష్టించాడు. గొల్లపూడి వైపుగా వెళుతున్న ఓ వ్యాపారి కారును ఆపి లిఫ్టు అడిగి ఎక్కాడు. కొంతదూరం వెళ్లాక కారులో వ్యాపారిని పిస్టల్ తో బెదిరించి అతని వద్దనున్న 3 బంగారపు ఉంగరాలు, గొలుసును అపహరించాడు. తరువాత హనుమంతపాలెంలో దుండగుడు దిగి వెళ్లిపోయాడు. బాధితుడు వెంటనే దగ్గరలోని నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణమే దర్యాప్తుకు దిగారు. అయితే ఇదంతా సిమి ఉగ్రవాది పనేనని పోలీసులు ఓ వైపు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News