: తెల్లగా ఉన్న హీరోయిన్స్ అంటేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు: నటి శ్వేతా తివారీ


ప్రస్తుతకాలంలో కథానాయికలు తెల్లగా ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని బాలీవుడ్ నటి శ్వేతా తివారీ అంటోంది. అటువంటి ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉందని తెలిపింది. "తెల్లగా ఉన్న హీరోయిన్స్ ఉంటేనే ప్రేక్షకులు సినిమా చూసేందుకు వస్తున్నారు. నలుపురంగులో ఉంటే వారికి నచ్చడంలేదు. ఇలాంటి ఆలోచనా విధానం కచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది" అని శ్వేతా చెప్పుకొచ్చింది. కేవలం తెల్లగా ఉన్న వారే అందంగా ఉంటారని భారతీయులు అనుకుంటారని, చామన ఛాయతో ఉండి, ఆకట్టుకునే రూపురేఖలున్న వారిని అందమైన వారిగా పరిగణించరని నిరాశ వ్యక్తం చేసింది. ఇందుకు ఉదాహరణగా 1978లో వచ్చిన హిందీ చిత్రం 'సత్యం శివం సుందరమ్'ను శ్వేత పేర్కొంది. హింది సినిమాల్లో కథానాయికల ఆత్మ సౌందర్యానికి కూడా ప్రాముఖ్యత ఇస్తారని, కానీ చాలామంది ప్రేక్షకులు దాన్ని ఇష్టపడరని అంటోంది.

  • Loading...

More Telugu News