: విషమంగా ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి
సూర్యాపేటలో రెండు రోజుల కిందట జరిగిన సిమి ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆత్మకూరు (ఎం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య ఆరోగ్యం మరింత క్షీణించింది. హైదరాబాదు ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పారు. మరోవైపు అతని శరీరం నుంచి మూడు బుల్లెట్లు తొలగించినా, ఇంకా చిన్న మెదడులో ఉన్న బుల్లెట్ ను వెలికితీయాల్సి ఉంది. అయితే అతని ఆరోగ్యం విషమంగా ఉంది కాబట్టి, బుల్లెట్ తొలగిస్తే మరింత ఇబ్బంది అవుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఇంకొన్ని గంటలు గడచి ఆయన శరీరం స్పందిస్తే గానీ ఆపరేషన్ చేసే పరిస్థితి లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.