: మన పైలెట్ల మానసిక స్థితి ఏంటి?... కదిలిన అధికారులు


జర్మన్ వింగ్స్ విమానాన్ని మానసిక రోగి అయిన కో-పైలెట్ కావాలనే కూల్చేశాడని తేలిన తరువాత భారత్ లో విమానాలు నడుపుతున్న పైలెట్ల మానసిక పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు తలెత్తడంతో, డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు నేతృత్వంలో సమావేశమైన అధికారులు సమీక్ష జరిపి పైలెట్ల మానసిక ఆరోగ్యంపై ప్రస్తుత నిబంధనలను మరింత మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రతి ఆరు నెలలకోసారి ఫిట్ నెస్ పరీక్షకు హాజరుకావాలన్న నిబంధన అమలవుతోంది. ఇకపై సైకో మెట్రిక్ పరీక్షకూ హాజరుకావాలని కొత్తగా నిబంధన విధించనున్నట్టు తెలుస్తోంది. అయితే పైలెట్లకు ఎటువంటి పరీక్షలు పెట్టాలన్నది ఇంకా నిర్ణయించలేదని, అయితే ఇప్పుడున్న పరీక్షలను మరింత కఠినం చేస్తామని విమానయాన శాఖ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News