: ఆరుగురం కలిశాం... ఇక చూసుకోండి!: లాలూప్రసాద్ యాదవ్
బీహార్ లో జనతా పరివార్ కు చెందిన పార్టీల ఏకీకరణ పూర్తైందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, ఆరు పార్టీలు జనతా పరివార్ గా ఏర్పడ్డాయని వెల్లడించారు. దీనిపై లాంఛనంగా ప్రకటన చేయడం మాత్రమే మిగిలిందని ఆయన పేర్కొన్నారు. జనతా పరివార్ పార్టీలన్నీ ఒకే పార్టీ, ఒకే గుర్తుపై పోటీ చేయనున్నాయని ఆయన చెప్పారు. బీజేపీకి బీహార్ లో చెక్ చెప్పేందుకు లాలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.