: పరిశ్రమలు వస్తే తప్ప ఆదాయం పెరగదు: చంద్రబాబు
పరిశ్రమలు వస్తే తప్ప రాష్ట్రంలో ఆదాయం పెరిగే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరామన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రకటిస్తే రాష్ట్ర ఆర్థిక శక్తికి చోదకంగా పని చేస్తుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వస్తాయని జైట్లీకి సూచించినట్టు ఆయన తెలిపారు. దీంతో ఆయన పరోక్షంగా ప్రత్యేక హోదాపై చర్చించినట్టైంది.