: 540 వైద్యుల నియామకం చేపడతాం: మంత్రి కామినేని
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ వైద్యశాలలు, ప్రాధమిక వైద్య కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు త్వరలోనే వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో సమర్థవంతమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 540 వైద్యుల పోస్టుల భర్తీని త్వరలోనే చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వైద్యశాలల్లో పూర్తి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు.