: గ్రామ న్యాయవ్యవస్థ వల్ల తొందరగా న్యాయం జరుగుతుంది: బాబు


గ్రామ న్యాయవ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ప్రత్యేక కోర్టు లేదని, న్యాయవ్యవస్థ బలోపేతానికి నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి సూచించారు. సదస్సులో సిఫారసులు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఆలిండియా జ్యుడిషియల్ ఏర్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News