: ఉనికి కోసమే కాంగ్రెస్ నేతల ఆరోపణలు: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వాటర్ గ్రిడ్ పూర్తయితే పుట్టగతులు ఉండవనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేవలం చిత్తూరు జిల్లాలో నీటి సౌకర్యం కల్పించేందుకు ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పుడు పది జిల్లాలకు పది వేల కోట్ల రూపాయలు ఎలా సరిపోతాయని అంటున్నారని ఆయన నిలదీశారు. పదివేల కోట్లలో తెలంగాణ వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తామంటే, కాంగ్రెస్ నేతలకే కాంట్రాక్టులిస్తామని, ఎప్పట్లోగా పూర్తి చేస్తారో చెప్పాలని ఆయన సవాలు విసిరారు.