: 17 మంది పాక్, ఇరాక్, ఒమన్ దేశీయులను రక్షించిన భారతకోస్టు గార్డు
యెమెన్ నుంచి 17 మంది సిబ్బందితో బయల్దేరిన రెండు నౌకలు గుజరాత్ తీరంలో మునిగిపోయాయి. దీనిని గుర్తించిన భారత తీరరక్షకదళ గస్తీ నౌకలు అందులోని సిబ్బందిని రక్షించాయి. గుజరాత్ తీరం వెంబడి గస్తీ కాస్తున్న భారత భద్రతా సిబ్బందికి రెండు యెమెన్ కార్గో నౌకలు మునిగిపోతూ కనబడ్డాయి. దీనిని గుర్తించిన తీరరక్షక దళం, ఆ నౌకల్లోని 17 మందిని రక్షించాయి. 17 మందిలో పాకిస్థాన్, ఇరాన్, యెమెన్ దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్టు రక్షక దళం తెలిపింది. వీరిని క్షేమంగా ఆ దేశాల రాయబార కార్యాలయాలకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.