: ఐఎస్ఐఎస్ కు దీటైన జవాబిస్తున్నది మేమే!: టర్కీ రాయబారి
ఐఎస్ఐఎస్ కు దీటైన జవాబిస్తున్నది తామేనని ఇండియాలో టర్కీ రాయబారి బురాక్ అక్ కాపర్ చెప్పారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ స్థానంలో ఉండి, స్వార్థంగా ఎంత కాలం ఆలోచిస్తామో, అంత వరకు ఉగ్రవాదం అంతం కాదని అన్నారు. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంలో తాము ముందు వరుసలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్నది తామేనని, అయినప్పటికీ వారిని దీటుగా ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు. అదే సమయంలో సిరియా నుంచి వస్తున్న వలసదారులను కూడా బందీ నుంచి విముక్తి చేశామని ఆయన చెప్పారు. కరడుగట్టిన ఉగ్రవాదులను ఎదుర్కొంటూనే, మానవత్వాన్ని పరిమళిస్తున్నామని ఆయన తెలిపారు.