: మోదీని ప్రజలు దైవదూతగా భావిస్తున్నారు... కేంద్ర మంత్రి వెంకయ్య వ్యాఖ్య
దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజలు దైవదూతగా భావిస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజలకు మరింత దగ్గరవుతున్న మోదీపై బురదజల్లేందుకే కాంగ్రెస్ నిరాధార నిందలేస్తూ తన నైజాన్ని చాటుకుంటోందని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్ర విభజన చట్టాన్ని రూపొందించిన యూపీఏ ప్రభుత్వం చట్టంలో ప్రత్యేక హోదాను ఎందుకు ప్రస్తావించలేదో జైరాం తెలపాలని డిమాండ్ చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో ప్రభుత్వంపై నిందలేసే సంస్కృతికి ఇకనైనా కాంగ్రెస్ స్వస్తి చెప్పాలని ఆయన కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.