: సర్కారు తప్పిదం వల్లే నాగరాజు మృతి... అత్యాధునిక ఆయుధాలివ్వాలంటున్న ఎర్రబెల్లి


సూర్యాపేట షూటర్స్ ఎన్ కౌంటర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పిదం వల్లే కానిస్టేబుల్ నాగరాజు చనిపోయాడని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఉగ్రవాదులతో పోరుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన స్పెషల్ ఫోర్స్ ను వినియోగించి ఉంటే, ప్రాణనష్టం తప్పి ఉండేదని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. అంతేకాక రోజుకో కొత్త సవాల్ తో దర్యాప్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News