: ఇంజినీర్ ఆత్మహత్య ఘటనలో తమిళనాడు మాజీ మంత్రి అరెస్ట్
తమిళనాడు వ్యవసాయ శాఖలో ఇంజినీర్ గా పనిచేస్తున్న ముత్తుకుమారస్వామి ఆత్మహత్యోదంతం అన్నాడీఎంకే నేత, తాజా మాజీ మంత్రి కృష్ణమూర్తిని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. కుమారస్వామి ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణలతో కృష్ణమూర్తిని ఇప్పటికే తమిళ సీఎం పన్నీర్ సెల్వం తన కేబినెట్ నుంచి తొలగించారు. తాజాగా ఇంజినీర్ ఆత్మహత్య వెనుక మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావడంతో తమిళనాడు సీఐడీ కృష్ణమూర్తిని అరెస్ట్ చేసింది. కృష్ణమూర్తితో పాటు వ్యవసాయ శాఖలో ఇంజినీర్ గా పనిచేస్తున్న సెంథిల్ ను కూడా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.