: తప్పుడు ఆరోపణలు వద్దు... ఆ స్థలానికి కరెంట్ బిల్లు చెల్లిస్తున్నానంటున్న పార్థసారధి


భూకబ్జాకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత పార్థసారధి కొద్దిసేపటి క్రితం స్పందించారు. భూకబ్జాకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలల్లో ఎలాంటి వాస్తవం లేదన్న ఆయన, ఇప్పటికీ సదరు స్థలానికి సంబంధించిన కరెంట్ బిల్లులను తానే చెల్లిస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను కొనుగోలు చేసిన సదరు స్థలం రిజిస్ట్రేషన్ చెల్లదని కోర్టు చెబితే, ఎవరూ చెప్పకుండానే దానిని వదిలేస్తానని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలతో తనను అప్రతిష్ఠ పాలు చేయొద్దని ఆయన బాధితులకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News