: ఆగ్రాలో పేలుడు... ఇద్దరు మృతి
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో కొద్దిసేపటి క్రితం శక్తిమంతమైన పేలుడు సంభవించింది. నగరంలోని ఓ ఇంటిలో చోటుచేసుకున్న ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పేలుడుకు కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు గల కారణాలను వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు.