: ఇండోనేసియా కరెన్సీ ముఖచిత్రంపై గణపతి బొమ్మ!
గణనాయకుడిగా మనం పిలుచుకునే బొజ్జ గణపయ్యకు ఇండోనేసియాలో అరుదైన గౌరవం దక్కింది. తన కరెన్సీ పై సిద్ధివినాయకుడి బొమ్మను ముద్రించుకుని ఇండోనేసియా గణనాథుడికి తానిస్తున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చెప్పకనే చెప్పింది. ఇటీవల తాను విడుదల చేసిన 20 వేల రూపయా కరెన్సీ నోటు ముఖభాగంపై బొజ్జ గణపయ్యను ఇండోనేసియా ముద్రించింది. ఆ దేశ జనాభాలో హిందువులు 1.7 శాతమే అయినా, అందులో అంతర్భాగమైన బాలి ద్వీపంలో మాత్రం హిందువులదే మెజారిటీ (84 శాతం). గణనాథుడి బొమ్మ ముద్రితమైన ఇండోనేసియా కరెన్సీ నోటును తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కృష్ణమూర్తి వీధికి చెందిన ఇవటూరి రవి సుబ్రహ్మణ్యం సేకరించారు.