: హమ్మయ్య! అన్నయ్యను ఒప్పించా: అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్
ఎట్టకేలకు అన్నయ్యను ఒప్పించగలిగానని అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ట్విట్లర్లో తెలిపాడు. అల్లు అర్జున్ సినిమాల్లో కనిపించినంత చురుగ్గా సోషల్ మీడియాలో ఉండడు. ప్రత్యేకమైన క్షణాలను అలాగే ఉంచాలనేది గతంలో అల్లు అర్జున్ అభిప్రాయం. దీంతో తన తమ్ముడు, ఇతర నటీనటులు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నప్పటికీ, తాను మాత్రం పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దీంతో శిరీష్ అన్నను సోషల్ మీడియాలో పాలుపంచుకోవాలని సతాయించేవాడు. ఎట్టకేలకు అల్లు అర్జున్ అంగీకరించాడని శిరీష్ తెలిపాడు. ఈ నెల 8న ఉదయం 8 గంటలకు అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేస్తాడని శిరీష్ ట్వీట్ చేశాడు. 'సన్నాఫ్ సత్యమూర్తి' విడుదల సందర్భంగా ట్విట్టర్ ఖాతాతో అల్లు అర్జున్ సందడి చేయనుండడం అభిమానులకు పండగే.