: ప్రతి గ్రామానికి వెళ్లి అవగాహన కల్పిస్తాం: నిర్మలా సీతారామన్


భూసేకరణ బిల్లుపై దేశంలోని ప్రతి గ్రామానికి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, భూసేకరణ బిల్లుకు సంబంధించి, ప్రతిపక్షాల సలహాలు తీసుకున్నామని అన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి దీనిపై రాద్ధాంతం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. భూసేకరణ బిల్లు వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారని, నిజానికి న్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు. కాగా, భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షాలన్నీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు ప్రతిపాదించిన ప్రాంతంలో 80 శాతం మంది భూయజమానులు (రైతులు) ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలన్న నిబంధనను తొలగించకూడదని, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News