: ప్రపంచంలోని తొలి సౌరశక్తి స్టేడియంగా చిన్నస్వామి స్టేడియం రికార్డు
ప్రపంచంలోని తొలి సౌరశక్తి స్టేడియంగా చిన్నస్వామి స్టేడియం నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్ సీజన్8 ప్రారంభ సమయానికి పూర్తిస్థాయి సౌరశక్తిని వినియోగించుకుని పనిచేసే తొలి స్టేడియంగా రికార్డు సృష్టించనుంది. రాత్రిపూట పనిచేస్తే ఫ్లడ్ లైట్లు మినహా అన్ని లైట్లు సౌరశక్తితో పనిచేయనున్నాయి. తొలిదశలో స్టేడియం అవసరాలకు 400 కిలోవాట్ల విద్యుత్ ప్లాంట్ ను కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం ఏర్పాటు చేసింది. రెండో దశలో స్టేడియంను పూర్తి స్థాయి సౌరవిద్యుత్ స్టేడియంగా తీర్చిదిద్దుతామని ఆ రాష్ట్ర క్రికెట్ సంఘ కార్యదర్శి బ్రిజేష్ కుమార్ తెలిపారు.