: యోగాను ఎక్సర్ సైజ్ గానే భావించండి: లాస్ ఏంజిలెస్ కోర్టు


యోగాను మతపరమైన కార్యక్రమంలా కాకుండా, వ్యాయామంగా భావించాలని అమెరికాలోని లాస్ ఏంజిలెస్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. లాస్ ఏంజిలెస్ లోని స్కూళ్లలో యోగా నేర్పించడంపై ఆందోళన వ్యక్తం చేసిన కొంత మంది, విద్యార్థులపై హిందూ, బౌద్ధ మతాల్ని రుద్దుతున్నారంటూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన లాస్ ఏంజిలెస్ న్యాయస్థానం స్కూల్లో యోగా నేర్పించడం మతపరమైన హక్కులు ఉల్లంఘించినట్టు కాదని, యోగాను కసరత్తుగానే భావించాలని తీర్పునిచ్చింది. దీంతో అమెరికా స్కూళ్లలో యోగా బోధనకు ఉన్న అడ్డంకులు తొలగినట్టైంది.

  • Loading...

More Telugu News