: 'టైమ్స్ సెలెబెక్స్ ర్యాంకింగ్ ఆఫ్ ది ఇయర్-2014'గా దీపికా పదుకొనె
బాలీవుడ్ ముద్దుగుమ్మలు టైమ్స్ సెలెబెక్స్ ర్యాంకింగ్స్ లో ఒకరికొకరు పోటీపడ్డారు. ఇందులో టాప్ ప్లేస్ లో పొడుగుకాళ్ల సుందరి దీపికాపదుకొనె నిలిచింది. అంతేగాక సామాజిక మీడియాలో అభిమానులు బాగా అనుసరిస్తున్న ఫీమేల్ నటిగా తనే ఉంది. ఇదే ర్యాంకింగ్స్ లో మరో అందాల భామ కత్రినా కైఫ్ మూడవ స్థానంలో నిలిచింది. అయితే మోస్ట్ బ్రాండ్ ఎండార్స్ మెంట్ల విషయంలో కేట్ (16 బ్రాండ్లు)కే తొలి స్థానం దక్కింది. ఇక అనుష్క శర్మ అత్యధిక బాక్సాఫీసు కలెక్షన్ లో టాప్ నిలవగా, ఆన్ లైన్ లో అత్యధికులు వెతికే నటిగా శృంగార తార సన్నీ లియోన్ ఉంది. ఇక టాప్ 'న్యూ కమర్ ఆఫ్ ద ఇయర్' గా కృతి సనన్ నిలిచింది. 2014 ఏడాదికిగానూ వారంతా ఈ పాప్యులారిటీని దక్కించుకున్నారు.