: తెలంగాణలో ఎండలు బాబోయ్ ఎండలు!
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. భానుడి భగభగలకు హైదరాబాదులో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, మహబూబ్ నగర్ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండవేడిమికి ఇతర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండురోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది.