: బీడీ, సిగరెట్ పాకెట్ లపై హెల్త్ వార్నింగ్ లోగో సైజు పెంచాలంటూ మోదీ ఆదేశం
దేశంలో బీడీ, సిగరెట్ పాకెట్ లపై హెల్త్ వార్నింగ్ లోగో సైజు 65 శాతానికి పెంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖji ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖా మంత్రి జేపీ నద్దాకు సూచించారు. అయితే పార్లమెంటరీ కమిటీ సూచించినట్టుగా పొగతాగడం వల్ల కేన్సర్ రాదనడానికి ఆధారాలు లేవన్నారు. దానిపై మంత్రి నద్దా మాట్లాడుతూ, "పార్లమెంట్ ప్యానెల్ సిఫార్సు మేరకు వార్నింగ్ లోగోపై చర్యలు తీసుకుంటాం. చిత్రాల హెచ్చరిక పార్లమెంట్ అధీన చట్టం కమిటీ వల్లే బయటికి వచ్చింది. వారు చెప్పిన ఉద్దేశాలపై కొన్ని సమస్యలున్నాయి" అని పేర్కొన్నారు. ఇటీవల పొగాకు ఉత్పత్తులపై బీజేపీ ఎంపీల వ్యాఖ్యలు... అసలు ధూమపానం వల్ల ఎలాంటి వ్యాధులు రావంటూ ప్రకటనలు చేసిన నేపథ్యంలో మోదీ పైవిధంగా స్పందించినట్టు తెలుస్తోంది.