: ఈ నెల 14 నుంచి లోకేష్ యాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఆ పార్టీ యువనేత నారా లోకేష్ ఏపీ రాష్ట్ర యాత్రను చేపడుతున్నారు. ఈ నెల 14 నుంచి యాత్ర ప్రారంభంకానుంది. ఈ యాత్రకు 'కార్యకర్తల సంక్షేమ యాత్ర'గా నామకరణం చేశారు. చిత్తూరు జిల్లా నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. మరోవైపు, పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ నియోజకవర్గం హిందూపురం నుంచి యాత్రను చేపట్టాలని పలువురు నేతలు సూచిస్తున్నారు.