: పోలీసులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారు: కేసీఆర్


నల్గొండ జిల్లా జానకీపురం ఎన్ కౌంటర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. దుండగుల విషయంలో పోలీసులు స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించారని... అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. తెలంగాణ పోలీసులు తమ విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయడంలేదని అన్నారు. దుండగుల కాల్పుల్లో మరణించిన వారి త్యాగం మరువలేనిదని... వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ బాలగంగిరెడ్డి, ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్యపరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News