: శవ రాజకీయాలు ఆపేయండి... జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే అనిత సూచన
వైకాపా అధినేత జగన్ పై పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తరచుగా 'ఓదార్పు యాత్ర' పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలను మానుకోవాలని జగన్ కు సూచించారు. వీలైతే, సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో టీడీపీ ప్రభుత్వానికి సహకరించే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. అంతేకాని, ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకానికి అడ్డు తగులుతూ, ప్రజలకు చెడు జరిగేలా ప్రవర్తించరాదని సూచించారు.