: విశాఖలో ఈ నెల 8 నుంచి కామన్ వెల్త్ పార్లమెంటరీ సమావేశాలు: స్పీకర్ కోడెల
విశాఖ నగరంలో ఈ నెల 8 నుంచి కామన్ వెల్త్ పార్లమెంటరీ సమావేశాలు జరగనున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 10 వరకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. అంతకుముందు విశాఖలోని సర్క్యూట్ హౌస్ జిల్లా అధికారులతో స్పీకర్ సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. సమావేశాలకు పది దేశాల నుంచి ప్రతినిధులు, 20 రాష్ట్రాల నుంచి స్పీకర్లు హాజరవుతారని కోడెల వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్న ఈ సమావేశాల్లో చట్టసభలు, మీడియా అంశాలపై చర్చిస్తారని చెప్పారు.