: అపోలో టైర్స్ లావాదేవీలో చట్ట వ్యతిరేక చర్యలు... యూఎస్ లో భారత సంతతి ఇన్వెస్టర్లపై అభియోగాలు
ఇండియాకు చెందిన అపోలో టైర్స్ ప్రతిపాదించిన కాపర్ టైర్ అండ్ రబ్బర్ విలీనంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసీ) ఇద్దరు భారత సంతతి పెట్టుబడిదారులపై అభియోగాలు నమోదు చేసింది. మసాచుసెట్స్ కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అమిత్ కనోడియా, కనెక్టికట్ కు చెందిన వెంచర్ కాపిటల్ సంస్థ యజమాని ఇఫ్తికార్ అహ్మద్ లు మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని, వీరు చట్ట వ్యతిరేక లాభాలు స్వీకరించారని, యూఎస్ అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. జూన్ 2013లో రెండు కంపెనీలు విలీనాన్ని ప్రకటించిన తరువాత కాపర్ టైర్ అండ్ రబ్బర్ ఈక్విటీ వాటా విలువ ఏకంగా 41 శాతం పెరగడం వెనుక వీరిద్దరూ ఉన్నారని ఆరోపించారు. వీరు సుమారు 1.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6.8 కోట్లు) లాభపడ్డారని తెలిపారు.