: ఇక చర్యలు తప్పవు... కేంద్ర మంత్రులకు మోదీ సీరియస్ హెచ్చరిక!
బాధ్యతారాహిత్యంతో కూడిన కామెంట్లు చేస్తూ, పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్న కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలకు ప్రధాని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. బెంగళూరులో జరుగుతున్న రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన మోదీ, అమిత్ షాలు ఈ మేరకు నేతలతో చర్చించారు. అభ్యంతరకరంగా, బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని వారు స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన జాతి విద్వేష వ్యాఖ్యలు బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికిప్పుడు బీజేపీ నేతలను కట్టడి చేయడం కష్టమేనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.